భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 29 (ఈతరం భారతం); : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39.9 అడుగులకు చేరింది. రాత్రి వరకు గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది
.















