EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కుమార్తె పెళ్లిపై షర్మిల అప్డేట్..  వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి పెళ్లి కార్డు పెట్టి ఆశీస్సులు

ఈతరం భారతం ఇడుపులపాయ సెప్టెంబర్ 18:

_____________________________________

కుమార్తె అంజలి రెడ్డి వివాహంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం జరుగుతుందని చెప్పారు.అంతేకాకుండా నవంబర్ 25న వివాహం జరుగుతుందని, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు తొలి పెళ్లి కార్డు ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆశీస్సులతో వివాహ వేడుక జరగడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు. అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. తన తండ్రి దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ అంటూ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమలో షర్మిల అనిల్ దంపతులు వారి కుమారుడు, విజయమ్మతో పాటు అంజలికి కాబోయే అత్తమామ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top