EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి

ఈతరం భారతం భూపాలపల్లి సెప్టెంబర్ 3 :ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి.కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహంపడేసి, చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ.జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన.భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ.ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి.వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ను కూడా కడతేర్చిన కసాయి తల్లి . కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించిన కవిత.పోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు.2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకున్న కిల్లర్ లేడీ.. మరో హత్య కోసం కూడా ప్లాన్.ప్రియుడిని, కవితను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన పోలీసులు.

Related News

Select the Topic
Scroll to Top