ఈతరం వాస్తు
ఎంత కష్టపడి అయినా ఒక ఇంటిని నిర్మించుకోవాలని జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఎన్నో ఆశలతో కట్టించుకున్న ఇంటి గృహప్రవేశానికి కొందరు హడావుడిగా చేసేస్తుంటారు.ముహూర్తం కుదిరితే కొంతమంది గృహ నిర్మాణం మధ్యలో ఉండగానే గృహప్రవేశం చేస్తూ ఉంటారు.ఇల్లు పనులు పూర్తికాకముందే తరువాత మంచి ముహూర్తాలు లేవని,ఇంట్లో వాళ్లకి ఒంట్లో బాగోలేదని,ఇంకొక కారణంతోనో గృహప్రవేశం తగదని శాస్త్రం చెబుతోంది.నిర్మాణం పూర్తికాని ఇంట్లో ఉండేది రాక్షసులు మాత్రమే. అకాల మరణం చెందినవారు పాడుబడ్డ ఇళ్లల్లోనూ,గృహ నిర్మాణం సాగుతున్న ఇళ్ల లోనూ,అతి నిదానంగా నిర్మాణం జరుగుతున్న ఇళ్ల లోకి తిష్టి వేస్తారంట.అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇళ్లలోకి చేరితే కలిగేది నష్టమే.కాబట్టి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే మంచి ముహూర్తం చూసుకొని గృహప్రవేశం చేయటం మంచిదని అని పండితులు చెప్తున్నారు.















