EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

ఇద్దరం భారతం హైదరాబాద్ జూలై 24

హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్కాజ్‌గిరి పరిధిలోని లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ చేపట్టింది. ఒకే పిటిషన్‌లో మూడుసార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేయకుండా మళ్లీ అదే భూమిలోకి వెళ్లడం తీవ్ర నేరమని హెచ్చరించింది. సదరు భూమిలో ఆర్మీ రక్షణ ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Related News

Select the Topic
Scroll to Top