EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

70 మంది దివ్యాంగులకు మోటరైజ్డ్ త్రీ వీలర్ స్కూటీల పంపిణీ

ఈతరం భారతం తిరుపతి జూలై 24 రిపోర్టర్ మనోజ్ కుమార్

దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు,హిజ్రాలకు 70 మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, ఏపీ స్టేట్ డిసేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ నారాయణ స్వామి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదా శివం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 70 మంది అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ త్రీ వీలర్ స్కూటీలను పంపిణీ చేశామన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగులు, స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి మెరిట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అవసరమైన ఇతర అర్హులను గుర్తించి తదుపరి విడతలో కూడా వాహనాలు అందజేస్తామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దివ్యాంగులకు రూ.6,000 సామాజిక భద్రతా పింఛన్, మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 పింఛన్, డయాలసిస్ రోగులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగానే విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోందన్నారు. ఉద్యోగ నియామకాలలో దివ్యాంగుల రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నామని, అలింకో (ALIMCO) ద్వారా నిర్వహించిన అంచనా శిబిరాల అనంతరం అవసరమైన సహాయక పరికరాలను త్వరలో అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి మాట్లాడుతూ దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల భాగస్వామ్యానికి ప్రోత్సాహం, విద్య, ఉపాధి, గృహ వసతి, స్వయం ఉపాధి రుణాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి చర్యలు దివ్యాంగుల అభ్యున్నతికి దోహదపడతాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి, భద్రత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల భాగస్వామ్యానికి ప్రోత్సాహం, బాపట్లలోని వికలాంగుల కళాశాలను డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేయడం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, స్వయం ఉపాధి రుణాలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, టచ్ ఫోన్లు, అవసరమైన సహాయక పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలతో దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందించిన త్రీ వీలర్ స్కూటీలతో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఇతరులపై ఆధారపడకుండా జీవనోపాధి పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తమ సమస్యలను గుర్తించి ఈ సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమం అనంతరం లబ్ధిదారులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top