ఈతరంభారతం వనపర్తి సెప్టెంబర్ 10 :
తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు గోడ దూకిన 70 మంది గురుకుల విద్యార్థులు.మధ్యలో అడ్డుకుని తిరిగి గురుకులానికి పంపించిన పోలీసులు .
వనపర్తి జిల్లా చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు కాంపౌండ్ వాల్ దూకి పంట పొలాల మీదుగా పరుగులు తీసిన 70 మంది 10వ తరగతి విద్యార్థులు.ప్రిన్సిపాల్ తమను బూతులు తిడుతున్నాడని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, సిబ్బందితో కలిసి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని, వినతి పత్రంలో పేర్కొన్న విద్యార్థులు.వినతి పత్రం కలెక్టర్‌కు అందించేందుకు గోడ దూకి కలెక్టరేట్ వైపు పరుగులు తీస్తుండగా, అడ్డుకుని తిరిగి పాఠశాలకు పంపించేసిన పోలీసులు.














