ఈతరం భారతం పరిశోధనాంశం:
ఈ పక్షిని(కలివి కోడి) గుర్తించడానికి రూ.50 కోట్ల ఖర్చు.అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షుల్లో కలివికోడి ఒకటి. వైఎస్సార్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో వీటి ఉనికిని గుర్తించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్ల వరకు వెచ్చించాయి. 27 సెంటీమీటర్ల పొడవుండే ఈ పక్షిని ఇటీవల ఈ అభయారణ్యంలో పక్షి పరిశోధక బృందం సభ్యులు గుర్తించారు. ఈ పక్షి కూస్తే దాదాపు 200 మీటర్ల దూరం వినిపిస్తుంది. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ వీటి లక్షణం.















