నల్ల గొండ అక్టోబర్ 4 (ఈతరం భారతం);తుంగతుర్తి లో మాజీ మంత్రి ఆర్. దామోదర రెడ్డి అంత్యక్రియలలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని దామోదర్ రెడ్డి ని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి పాడే మోసి అంతిమ సంస్కారాలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరులు పాల్గొని దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీ కి సేవలు అందించిన దామోదర్ రెడ్డి పార్థివ దేహంపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జెండా కప్పి నివాళులు అర్పించారు.














