ఈతరం భారతం జోగులాంబ గద్వాల అక్టోబర్ 17..బీసీ సంఘాలు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు పిలుపుమేరకు బీసీ సంఘాల అఖిలపక్ష లా ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రప్రభుత్వం జీవో 9 స్టే ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18 జరిపే రాష్ట్ర బండ్ ను జయప్రదం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ పిలుపు నిచ్చారు.అలాగే కేంద్ర ప్రభుత్వం మాత్రం 42% బిసి రిజర్వేషన్ పైన ఆమోదం తెలపకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు.
42 శాతం రిజర్వేషన్ పోరాటం ఉదృతం చేస్తామని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఈనెల 18న తెలంగాణ బందుకు పిలుపునిస్తున్నట్టు బీసీ సంఘాలు, అఖిలపక్ష నాయకులు తెలియజేశారు. కావున 18న జరిగే రాష్ట్రవ్యాప్త బీసీ బందు లో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు అఖిలపక్ష నాయకులు వ్యాపారులు జిల్లా ప్రజలు బిసి బందుకు సహకరించాలని కోరుతున్నాం పాల్గొన్న సంఘాలు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు














