ఈతరం భారతం/బాసర /నవంబర్ 1:
శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ) మాసో త్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమములు, అధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవం గా జరిగినవి.ముందుగా దీపారాధన,కలశస్థాపన, పుణ్యాహవచనము ,లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య, కోటి పార్థివ లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకము , కుంకుమార్చన ,గణపతి, నవగ్రహ ,రుద్ర ,సరస్వతి హోమములు, భూదాన సంకల్ప పూజ, మరియు అన్నదానము ఘనంగా నిర్వహించారు.జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించిన వాసుదేవాసత్సంగ్ సభ్యులు, కోటి పార్థివలింగ స్తూప మందిర సలహాదారులు, శ్రీ శారద రాజేశ్వర్ లకు ఉత్తమ ఆధ్యాత్మిక ధార్మిక సేవా పురస్కారం ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీ నిర్మల అంబికా నాథ శర్మ దంపతులు అందజేసినారు .
మాసోత్సవము విజయవంతం కావడానికి కారకులైన ధూప దీప నైవేద్య కమిటీ సభ్యులు మాధవి ,రవివర్మ ,విజయ, భారతి ,తోట పద్మ, సుమన్, కె రాజేశ్వరి ,ఉమా శైలజ, యాదమ్మ ,గాదెభరత్ ,శరత్, జ్యోతి, చింతాస్వరూపారాణి, ఎస్ సునీత ,వింజమూరి రామలక్ష్మి ,బెజవాడ లాస్య, కొండ వీణ, రుక్మిణి ,రజిత, తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు .మరియు ప్రతి నెల మూడవ ఆదివారము మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమంలో భాగంగా ఉచితముగా ఎలాటి ఎంట్రీ ఫీ తీసుకోకుండా నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నామని ఆసక్తి గల నాట్య గురువులు తమ పిల్లల చేత నృత్య ప్రదర్శన చేయించదలచిన వారు 9948332032 సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవలసినది గా శర్మ కోరారు.














