ఈతరం భారతం/బాసర /నవంబర్ 3 :
శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ) మాసో త్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమములు, అధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవం గా జరిగినవి.ముందుగా దీపారాధన,కలశస్థాపన, పుణ్యాహవచనము ,లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య, కోటి పార్థివ లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకము , కుంకుమార్చన ,గణపతి, నవగ్రహ ,రుద్ర ,సరస్వతి హోమములు, భూదాన సంకల్ప పూజ, మరియు అన్నదానము ఘనంగా నిర్వహించారు..సాంస్కృతిక కార్యక్రమములో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గణించిన జగ్గయ్య పేట వాస్తవ్యులుశ్రీ త్రినేత్ర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యాచార్యులు శ్రీ భారతి కి మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ అపరాజిత నాట్య గురుకుల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సరితశ్రీ లకు ఉత్తమ ఆధ్యాత్మిక సాంస్కృతిక నాట్య సేవ పురస్కార ప్రదానోత్సవం ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికా నాథ శర్మ సంధ్య దంపతులు .అందజేశారు. నాట్యాచార్యులు శిష్యులు చక్కని నృత్యాభినయముతో కళా ప్రియులను కట్టి పడేశారు. పదాలకు అనుగుణముగా అడుగులు వేస్తూ భావాలకు అద్దం పట్టేలా అభినయిస్తూ ప్రదర్శించిన నృత్యాంశములు అందరినీ ఆకట్టుకున్నాయి.ప్రతి నెల మూడవ ఆదివారము మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమంలో భాగంగా ఉచితముగా ఎలాటి ఎంట్రీ ఫీ తీసుకోకుండా నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నామని ఆసక్తి గల నాట్య గురువులు తమ పిల్లల చేత నృత్య ప్రదర్శన చేయించదలచిన వారు 9948332032 సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవలసినది గా శర్మ కోరారు














