EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నాట్యాచార్యులు భారతి మరియు సరిత లకు ఉత్తమ సాంస్కృతిక నాట్య సేవ పురస్కారము 

ఈతరం భారతం  బాసర నవంబర్ 27

శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ) మాసో త్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమములు, అధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవం గా జరిగినవి..సాంస్కృతిక కార్యక్రమములో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గణించిన జగ్గయ్య పేట వాస్తవ్యులుశ్రీ త్రినేత్ర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యాచార్యులు భారతి కి మరియు హైదరాబాద్ వాస్తవ్యులు అపరాజిత నాట్య గురుకుల వ్యవస్థాపక అధ్యక్షులు సరితశ్రీ లకు ఉత్తమ ఆధ్యాత్మిక సాంస్కృతిక నాట్య సేవ పురస్కార ప్రదానోత్సవం ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికా నాథ శర్మ సంధ్య దంపతులు .అందజేశారు. .ప్రతి నెల మూడవ ఆదివారము మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమంలో భాగంగా ఉచితముగా ఎలాటి ఎంట్రీ ఫీ తీసుకోకుండా నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నామని ఆసక్తి గల నాట్య గురువులు తమ పిల్లల చేత నృత్య ప్రదర్శన చేయించదలచిన వారు 9948332032 సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవలసినది గా శర్మ కోరారు

.

Related News

Select the Topic
Scroll to Top