EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గ్రూపులు బువ్వ పెట్టవు.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు

ఈతరం భారతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 2

రాజకీయ నాయకుడికి గెలవడమే అంతిమ గీటురాయి సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని ఈటల రాజేందర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహాస సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ మన పరివార క్షేత్రాలు అనేక సమస్యల మీద కొట్లాడుతాయి. కానీ వాటిని పరిష్కరించే సత్తా అధికారంలోకి వస్తేనే ఉంటుంది. అనేక సంవత్సరాల స్వప్నం 370 ఆర్టికల్ రద్దు కేంద్రంలో ప్రభుత్వం ఉండటంవల్లనే సాధ్యమైంది. రామాలయం కోసం అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారు, వేలమంది జైల్లో మగ్గారు. చివరికి అది ఫుల్ ఫిల్ అయింది అంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉండటం వల్లనే.అధికారం రాకపోతే.. మనం గెలిచిన వారి ఇంటి ముందు కాపలాకాయాల్సిందే నన్నారు. మస్కా కొట్టి పని చేయించుకునే పరిస్థితి పోవాలంటే మనం గెలవాలి. దుర్మార్గన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది. నేను ఎంపీగా గెలిచానంటే అది మీ అందరి అండతోనే. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కానీ.. ఒక్క జడ్పిటిసి కానీ.. ఒక మున్సిపల్ చైర్మన్ కానీ… నీటి సంఘాల చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు ఏదీ ఓడిపోలేదు. వయసు, రాజకీయ జీవితం చిన్నదే అయినా.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా కొట్లాడాను.. ఒక 40 ఎలక్షన్స్ కు ఇంచార్జిగా పనిచేశాను.గెలవాలంటే మొట్టమొదటిగా.. మంచి అభ్యర్థిని ఎంపిక చేయండి అని పిలుపునిచ్చారు. సామాజిక వర్గాల సమీకరణ మర్చిపోవద్దు. వాతావరణ కల్పన జరగాలి. ఎదుటివారికి చెమటలు పట్టించాలి. గట్టి లీడర్లను పార్టీలో చేర్చుకోవాలి. భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిస్తే అది ఒకటి గుజరాత్ నుంచి ఇంకోటి తెలంగాణ నుంచి.. ఇప్పుడు గుజరాత్ ఎక్కడ ఉంది తెలంగాణ ఎక్కడ ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఒక పెద్ద మనిషి మమ్మల్ని హెచ్చరించారు. 27 ఏళ్ల తర్వాత కూడా గుజరాత్ లో మళ్లీ అధికారంలోకి వస్తే..45 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో అధికారం వస్తుందో రాదో అనే సంశయంలో ఉన్నారు అని అన్నారు. పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి అక్కున చేర్చుకోండి కాకులు గద్దల లెక్క పొడవకండి. రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. బీజేపీ నేతలు కూడా అలా ఆలోచన చేయాలన్నారు. పరిపక్వత పెరగాలి కలిసి పనిచేయాలి. స్థానికంగా గ్రూపులు మంచివి కావు. గ్రూపులు బువ్వ పెట్టవు. ఉన్న శక్తే తక్కువ ఇందులో గ్రూప్స్ అవసరమా ? తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ళ మీద పడి నాయకులను కాపాడుకున్నాం. వేరే పార్టీ వారిని తెచ్చుకున్నాం, ఎన్నికల్లో గెలిపించుకున్నాం.మల్కాజిగిరి పార్లమెంట్ లో 1992 నుండి ఉంటున్న నన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. 25 ఏళ్ల నుండి పార్టీని నమ్ముకునే పని చేసే నిజమైన కార్యకర్తకు పిల్లల ఫీజు కట్టే డబ్బులు కూడా ఉండవు. పార్టీ బలంగా ఉంటే గెలవడానికి పైసలు అక్కర్లేదు. కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడవవన్నారు.. నేను పొత్తుల సద్దిని.మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేశవ్యాప్తంగా ఒక వేవ్ వచ్చింది. ఈటల రాజేందర్ వల్ల కొంచెం ఎక్కువ ఓట్లు రావచ్చు కానీ గెలిచింది మాత్రం మోదీ గారి వల్లనే. ఆ వేవ్ ను మనకు అనుకూలంగా మార్చుకోవడం వల్లనే నాలుగు లక్షల మెజారిటీ వచ్చింది. గౌరవం పరస్పరంగా ఉండాలి. నువ్వు లీడర్లను గౌరవిస్తేనే.. నిన్ను కార్యకర్తలు గౌరవిస్తారన్నారు. బీజేపీ అజేయమైన శక్తిగా ఎదగాలి. నన్ను మీరు గెలిపించారు. మీ గెలుపులో ఉడత భక్తిగా సాయం చేస్తా.నా చేతులు దండం పెట్టడానికి అలవాటు పడ్డాయి. నాకు ప్రజలే దేవుళ్ళు. మీకోసం ఎన్నిసార్లయినా దండం పెడతా. మంచికి ఎప్పుడూ గొప్ప స్థానం ఉంటుంది. మన కొట్లాట వల్ల జి హెచ్ ఎం సి లో మన కార్పొరేటర్స్ కి 300 కోట్ల నిధులు వచ్చాయి. బీజేపీ లెటర్ ప్యాడ్ మీద లెటర్ పెడితే కోట్ల నిధులు వచ్చాయి. మోడీ గారు ఎప్పుడూ నేను ఇచ్చిన అనరు, నేను సేవకుడిని మాత్రమే.. ప్రజలే యజమానులు అని అంటారు. ఇక్కడున్న సంకుచిత వాదులు మాత్రం నేను ఇచ్చిన అంటారు.గెలుపే లక్ష్యంగా పనిచేయడం నుండి నేను మీకు అండగా ఉంటాను.జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి నందా రెడ్డి చంద్రారెడ్డి శోభమ్మ రామోజీ సురేష్ మోహన్ రెడ్డి సుధాకర్ లక్ష్మమ్మ శైలజ వెంకటరెడ్డి శ్రీనివాస్ పావని తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top