EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈనెల 20న కళాకారుల చలో హైదరాబాద్

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 12

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తమ ఆటపాటలతో ఊరురా ధూంధాం నిర్వహించి తెలంగాణ భావజాలాన్ని పల్లె పల్లెకు తీసుకువెళ్లిన కళాకారుల కు తక్షణమే తెలంగాణ సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, డిమాండ్ చేశారు నేడు హైదరాబాదులోని బీసీ భవన్ లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20 వ తేదీన నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్, కళాకారుల పోరు దీక్ష వాల్ పోస్టర్ ను తెలంగాణ ఉద్యమ కళాకారుల తో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కేవలం కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతోనే పల్లె పల్లెకు విస్తరించిందని, కళాకారుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కళాకారులను ఆదుకోవలసిన ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో వందలాదిమంది కళాకారుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో కళాకారులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతాదని ఆశించిన కళాకారులకు నేడు నిరాశే మిగిలిందని కళాకారులకు తెలంగాణ సారధిలో ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ తన బాధ్యతను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావులో తక్షణమే జోక్యం చేసుకొని నిరుద్యోగ కళాకారులకు ఆదుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం వ్యవస్థాపకులు అనుమోజు వెంకటేశం మాట్లాడుతూ కళాకారుల హక్కుల కోసం ఈనెల 20వ తేదీన హైదరాబాదులోని ఇంద్ర పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు కళాకారుల ఊరు పోరు దీక్ష చేపట్టామని ఈ ఆందోళన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ కళాకారులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జువాజి ప్రవీణ్, కొండ్ర కుమార్, హైమత్, పి రమేష్, కొత్త నరసింహస్వామి, గూడూరు భాస్కర్, బండి గారు రాజు, వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top