EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదాద్రి భువనగిరి జిల్లాలో  ఘనంగా భోగి సంబురాలు 

ఈతరం భారతం జనవరి 14 యాదాద్రి భువనగిరి :

జిల్లా పరిధిలోని భువనగిరి,ఆలేరు నియోజకవర్గాలలోని పట్టణ కేంద్రాలు, వివిధ గ్రామాలలో బుధవారం భోగి పర్వదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గ్రామాలలో భోగి మంటలు వేసి పిల్లలకు భోగి స్నానాలు చేయించి పెద్దలు ఆశీర్వచనాలను అందజేశారు. వాకిళ్లలో సంక్రాంతి ని స్వాగతిస్తూ వివిధ రంగులలో అందమైన ముగ్గులను మహిళలు, యువతులు, బాలికలు వేశారు. ఆలయాలలో జరిగిన భోగి ప్రత్యేక పూజలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పలుచోట్ల ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలైన మహిళలకు బహుమతులను అందజేశారు. యువకులు, పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తూ సంక్రాంతి సంబరాలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు.

Related News

Select the Topic
Scroll to Top