ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 16
రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల పదవీ కాలం ఈ నెల చివరి వారంతో పదవీ కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు కావొస్తుందని ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే నగరానికి మేయర్ ను, మున్సిపల్ పట్టణాలకు చైర్మన్ లను ప్రజలే ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకొనేల చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు. గతంలో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహీంచాలని బహిరంగ లేఖ ద్వారా ఈ-మెయిల్ ద్వారా ముఖ్యమంత్రిని కోరామని అయినా ఈనాటి వరకు ప్రభుత్వం స్పందిచక పోవడం స్థానిక ప్రభుత్వాల పట్ల నిర్లక్ష ధోరణి స్పష్టమైందని ఆయన అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల విధానం కొత్తదేమి కాదని గతంలో మూడు సార్లు 1987 -1992, 1992 – 1997 మరియు 1997 – 2002 వరకు మున్సిపల్ చైర్మన్ పదవికి గ్రామ సర్పంచ్ మాదిరిగా పట్టణ ప్రజలు ప్రత్యక్షంగా చైర్మన్ ని ఎన్నుకొనేవారని అదే విధంగా నగర మేయర్ ని ప్రత్యక్షంగా నగర ప్రజలు ఎన్నుకొనేవారని అయితే గత ప్రభుత్వాల కుట్ర, స్వార్థ, ధన రాజకీయాల మూలంగా అధికార క్రీడల నేపథ్యంలో చైర్మన్ పదవులు వేలం పాటలకు దారితీశాయని స్థానిక ప్రభుత్వాల మనుగడ ప్రష్ణార్ధకం అయ్యిందని ఇక ఎంత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం లేదని త్వరలో జరిగే ఎన్నికలలో మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లను, నగర కార్పొరేషన్ మేయర్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకొనేలా చర్యలు తీసుకోవాలని తుమ్మనపల్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు గతంలో బహిరంగ లేఖ ద్వారా సైతం ముఖ్యమంత్రిని కోరామని ఈనాటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డురంగా ఉందని ఆయన అన్నారు.














