EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లాటరీ పద్ధతి ద్వారా మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు – జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ఈతరం భారతం ఖమ్మం , జనవరి -17:

లాటరీ పద్దతి ద్వారా జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు చేసినట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు.  ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డులలో మహిళ రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇంచార్జి కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మున్సిపల్ వార్డులలో మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయడం జరిగిందని అన్నారు.

ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ స్థితిగతులను తెలుపుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సత్తుపల్లి, మధిర, ఏదులాపురం, వైరా, కల్లూరు మున్సిపాలిటీలలో వార్డుల వారిగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ లాటరీ పద్ధతి ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు, ఎలక్షన్ సెక్షన్ డిటి అన్సారీ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

 

 

Related News

Select the Topic
Scroll to Top