EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఘనంగా బిజెపి విజయ్ సంకల్ప సమ్మేళనం    పార్టీ శ్రేణులకు పార్టీ రథసారధి ఎన్.రాంచందర్ రావు దిశానిర్దేశం

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 17

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ & మున్సిపాలిటీ ఎన్నికల విజయ్ సంకల్ప సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, బిజెపి శాసనసభా పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి , బిజెపి శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి , ఎంపీలు ఈటల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి , నగేష్ , శాసనసభ్యులు పాయల్ శంకర్ , వెంకటరమణా రెడ్డి , రామారావు పాటిల్ , సూర్యనారాయణ గుప్తా , ఎమ్మెల్సీలు అంజిరెడ్డి , మల్క కొమురయ్య , బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్ గారు, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతమ్ రావు , వేముల అశోక్ , శ్రీ తూళ్ల వీరేందర్ గౌడ్ , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ , మాధవి , సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావు , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ , పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, బిజెపి మోర్చా నాయకులు, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు పార్టీ రథసారధి ఎన్.రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది.తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.రానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 52 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఒక వంతు హైదరాబాద్‌లో, మరొక వంతు గ్రామీణ ప్రాంతాల్లో, మూడో వంతు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నివసిస్తున్నారు.మన భవిష్యత్తు బాగుండాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే, పేదలకు ఇండ్లు రావాలంటే, ఆరోగ్య భద్రత కావాలంటే- అది కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల ద్వారానే సాధ్యం. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది.ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదు? ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఇటీవల కేరళలోని త్రివేండ్రం రాజధానిలో కమ్యూనిస్టు అడ్డాలో కాషాయ జెండాను ఎగురవేశాం. వందలాది బిజెపి కార్యకర్తల త్యాగాల ఫలితంగా అక్కడ కాషాయ జెండా ఎగిరింది.అదేవిధంగా మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లను బిజెపి కైవసం చేసుకుంది. అలాగే తెలంగాణలోనూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి ప్రజలు ఆదరణ చూపాలని కోరుతున్నాను.మేము సేవ కోసమే వచ్చాం. ప్రజల పక్షాన నిలుస్తాం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతాం. అందుకే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరుతున్నానన్నారు.

Related News

Select the Topic
Scroll to Top