EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జగ్గారెడ్డి గా నేను మాట ఇస్తున్నా…  సంగారెడ్డి లో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి 80 గజాల స్థలం ఇస్తా

ఈతరం భారతం సంగారెడ్డి జనవరి 17

జగ్గారెడ్డి గా నేను మాట ఇస్తున్నా… సంగారెడ్డి లో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి 80 గజాల స్థలం ఇస్తానని లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.సంగారెడ్డి మున్సిపాలిటీ లో 2012-2013 లో ఇళ్ల పట్టా పొందిన వారితో పాటు ఇంటి స్థలం లేనివారితో సంగారెడ్డి గంజ్ మైదాన్ లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల ముఖా ముఖి సమావేశం నిర్వ్బహించారు. ఈ సందర్బంగా జగ్గ రెడ్డి మాట్లాడుతూ కిరాయి ఇళ్లలో ఉండేవాళ్ల కష్టాలు నాకే ఎక్కువగా తెలుసు- 22 సంవత్సరాలు కిరాయి ఇంటిలోనే ఉన్న.. అందుకే మీకు సొంత ఇంటి జాగ ఉండాలని ప్రయత్నం చేస్తున్న – ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలోనే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి సంగారెడ్డిలోని 5500 పేద ప్రజలకు 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించాను- ఆ రోజు మీకు అలియాబాద్, తోగర్ పల్లిలో నేను ఇప్పించిన స్థలాలను బి.ఆర్.ఎస్ పదేళ్ల పాలనలో వేరే పనులకు తీసుకున్నారు- మీలో ఒక్కరైనా మీకు ఇచ్చిన స్థలాల గురించి పదేళ్లలో ఎందుకు ప్రశ్నించలేదు- అందుకే మళ్ళీ మీకు 80 గజాల స్థలం ఇవ్వడానికి సంగారెడ్డి, కంది మండలాల్లో 200 ఎకరాల స్థల సేకరణ చేయడానికి కలెక్టర్ తో కూడా మాట్లాడాను- ఈ జనవరి నెల నుండే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్న.. వచ్చే నవంబర్ వరకు ఒక కొలిక్కి తీసుకొస్తాను.. భూసేకరణ కాగానే మళ్ళీ మీతో మీటింగ్ పెడతా-సర్టిఫికెట్లు లేనొల్లు సైతం మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకొండి⁠- వెయ్యి నోటు కోసం.. క్వార్టర్ సీసా కోసం మీ జీవితాలను ఆగం చేసుకున్నారు.. మళ్ళీ ఆగం కాకండి – ప్రతీ నెల 5 వేల రూపాయలు ఇంటి కిరాయి చెల్లిస్తే.. ఏడాదికి 60 వేలు.. పదేళ్లకు 6 లక్షలు నష్టపోయారు .. – ఆరోజే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ 6 లక్షల రూపాయలు మీకు మిగిలేవి కదా- నన్ను ఒడగొట్టారని నేను ఏనాడు బాధపడలేదు.. ఒక రకంగా మంచి పనే చేశారు..- నేను ఓడిపోవడం వల్ల నా భార్య నిర్మల కార్పొరేషన్ చైర్మన్ అయ్యింది- నాలుగున్నరేళ్లు నేను పైసలు పంచుతా.. నా దగ్గర డబ్బులు ఉంటాయి..- కానీ ఎన్నికలప్పుడే పైసలు ఉండవు.. నాకు అదే శాపం- వాళ్ళ లాగా నేను కూడా ఓటుకు వెయ్యి ఇయ్యామంటే ఇస్తా.. కానీ నాది అలా ఆలోచించే స్వభావం కాదు….పదేళ్లు అధికారం లేదు. ఇప్పుడు అధికారం లో ఉన్నా, నా మాట చెల్లుతది, సీఎం రేవంత్ రెడ్డి నేను చెబితే వింటడు…. జగ్గారెడ్డి గా నేను మాట ఇస్తున్నా… సంగారెడ్డి లో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి 80 గజాల స్థలం ఇస్తానన్నారు.

Related News

Select the Topic
Scroll to Top