ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 19
తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో రచనలకు అవార్డులిస్తాం అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.కళలు, సాహిత్య పురస్కారాల్లో సైతం రాజకీయ జోక్యం ప్రవేశించడం ప్రమాదకరమని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ జోక్యం కారణంగా సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేశారని ఇలాంటి పరిస్థితుల్లో సాహిత్య సంస్థల ప్రతినిధులు, రచయితల విజ్ఞప్తి మేరకు తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున హిందీయేతర భాషల్లో అత్యుత్తమ రచనలకు ఏటా జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలను అందిస్తామని చెన్నై అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆయన ప్రకటించారు.















