EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్టార్ హీరో అసభ్య ప్రవర్తనపై పూజ హెగ్డే సంచలన వ్యాఖ్యలు : నా అనుమతి లేకుండానే ఆ హీరో నా క్యారవాన్‌లోకి వచ్చాడు

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 19

టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజ హెగ్డే తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో, ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ, తన కెరీర్ బిగినింగ్‌లోనే ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోతో ఉండటంతో చాలా ఆనందంగా ఒప్పుకున్నానని చెప్పింది. అయితే షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పూజ వెల్లడించింది.“ఆ సినిమా షూటింగ్ సమయంలో నా అనుమతి లేకుండానే ఆ హీరో నా క్యారవాన్‌లోకి వచ్చాడు. అప్పటికే అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆ తర్వాత అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ క్షణంలో నాకు ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు. చాలా షాక్‌కు గురయ్యాను” అని పూజ చెప్పింది. ఆ పరిస్థితిని తట్టుకోలేకపోయిన తాను సహనం కోల్పోయానని, వెంటనే అతడిని లాగిపెట్టి కొట్టానని పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. “అలా చేయగానే అతడు వెంటనే క్యారవాన్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడితో కలిసి నటించాలనే ఆసక్తి నాకు పూర్తిగా పోయింది. అందుకే నా సీన్స్‌ను డూప్‌తో షూట్ చేశారు” అని ఆమె వివరించింది.అయితే ఈ ఘటనలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన హీరో ఎవరో మాత్రం పూజ హెగ్డే వెల్లడించలేదు. పేరు చెప్పకుండా వదిలేయడంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. మహిళా నటులు ఇండస్ట్రీలో ఎదుర్కొనే ఇబ్బందులపై మరోసారి ఈ వ్యాఖ్యలు చర్చను రేపాయి. ఇక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే, పూజ హెగ్డే ప్రస్తుతం దళపతి విజయ్‌తో కలిసి ‘జన నాయగన్’ అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఇది విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతుండగా, సంక్రాంతి సీజన్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొత్తంగా, పూజ హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మహిళల భద్రత, గౌరవం అంశాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

 

Related News

Select the Topic
Scroll to Top