ఈతరం భారతం సిద్దిపేట ఫిబ్రవరి 20:
సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు వంగ బాల్ రెడ్డి శుక్రవారం హత్యకు గురయ్యారు. రాజక్కపేట గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఘటన విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఈ హత్య ఘటన దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా, పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.














