నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 21 ఈతరం భారతం:
నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వాహకులు సర్పంచ్ సహా తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి, మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్నిఅడ్డుకొని దాడి చేశారు.తక్కువ జాతి వారని సదరు బీసీ కుటుంబాన్నినిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్‌ను, కోడలిని, కూతురిని బూతులు తిడుతూ నిర్వాహకులు దారుణంగా కొట్టారు.రెండు నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని చంద్రకళ కుటుంబసభ్యులు వేడుకున్నా కనికరించకుండా నిర్వాహకులు ఆ చిన్నారిని కాలుతో తన్నారు. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.చంద్రకళ కుటుంబసభ్యులు నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. నాగర్ కర్నూల్ పీఎస్‌లో పోలీసులతిరిగి బాధితులనే బెదిరించడం గమనార్హం. నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులు కావడంతో పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.














