EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇండ్ల కూల్చివేతలకి ముగ్గురు మంత్రులే బాధ్యత వహించాలి     భూదాన్ భూమిలోనే పేదలకు పక్క ఇండ్లు కట్టించాలి సీపీఐ( ఎమ్ ఎల్) చండ్ర పుల్లా రెడ్డి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాకేరేకంటి చిట్టి బాబూ డిమాండ్ 

హైదరాబాద్ మార్చ్ 2 ఈతరం భారతం:

సూర్యాపేట,ఖమ్మం,ఖమ్మంలోని వెలుగు మట్ట లో ప్రభుత్వం కూల్చి వేసిన ఇ o డ్లున్న భూదాన్ భూములు విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ( ఎమ్ ఎల్) చండ్ర పుల్లా రెడ్డి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాకేరేకంటి చిట్టి బాబూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు పేదల ఇండ్ల కూల్చి వెతకి జిల్లా కు చెందిన ముగ్గురు మంత్రులే నైతిక బాధ్యత వహించాలన్నారు , ఆ భూముల్లోనే పేదలకు పక్కా ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు,భూదాన్ భూములు విలువైనవి తుమ్మల అనడం సరైనది కాదన్నారు ,భూదాన్ భూములను దానం చేసిన వారు పేదల కోసమే దానం ఇచ్చారని గుర్తుచేశారు,1965,భూదాన యజ్ఞ బోర్డు చట్టం కూడా ఈ భూములు పెదాలకేచేందలని,ఇవ్వాలని చెబుతుందని తెలిపారు, ” విలువైన భూములు” అనే పేరుతో పేదలను అక్కడినుండి నుంచి వెళ్లగొట్టడం చేట్ట ఉల్లంఘనే అవుతుంది అన్నారు, భూదాన యజ్ఞ భూములను రెవెన్యూ శాఖ ఎలా స్వాధీనం చేసుకుంటుంది అని ప్రశ్నించారు, భూదాన్ భూములను ఆనాటి ఛైర్మెన్ రాజేందర్ రెడ్డి పేదలకు ఇండ్ల స్థలము ఇచ్చారు ,కాబట్టి అట్టి స్థలంలోనే పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు, సర్వం కోల్పోయిన పేదలను , అంబేద్కర్ భవన్, టి టి డి సి భవనాలకు ,నీళ్ళు,కరెంట్, తీసివేశారని మండి పడ్డారు,ప్రజల ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ,ప్రజల పట్లా ఇంత దుర్మార్గంగా ఉందని,అక్కడి సమస్య పరిష్కరించి,,పేదలకు న్యాయం చేయాలని లె నీ పక్షంలో పేద ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు

Related News

Select the Topic
Scroll to Top