వికారాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:
మహిళా దినోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరం లో వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి 117 వ సారి స్వచ్ఛంద రక్తదానం చేసారు.ఈ సందర్బంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ రక్త దానం మహాదానమని తోటి వారికి ప్రాణదానం అన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి తోటి ప్రాణాలు కాపాడాలని పిలుపు నిచ్చారు. మహిళా దినోత్సవ సందర్భంగా నేడు మహిళా దినోత్సవ సందర్భంగా 117 వ సారి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి రక్తదాన చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సాయి చౌదరి కలెక్టర్ దీపక్ తివారి నుండి రక్తదాన ప్రశంసా పత్రం అందుకున్నారు.















