మహబూబాబాద్ : ఈతరం భారతం మార్చ్ 23:
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో నిర్వహించిన డాడీ బంజారా లయన్స్ క్లబ్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఉమ్మడి రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమమానికి పెద్ద ఎత్తున సంఘం సభ్యులు పాల్గొన్నారు,జాతీయ స్థాయి లో ఉన్నటు వంటి ప్రతి డాడీ లంబాడి బంజారా కుటుంబాలను రాబోయే రోజుల్లో ఒకే తాటి పై తీసుకోని వచ్చే ప్రయత్నం లో భాగంగా సంస్థ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో డాడీ బంజారా కుటుంబాల్లో విద్య,వైద్యం,కష్టాల్లో ఉన్నవారికి సంస్థ ద్వారా చేయగలిగే సహాయం పై ద్రుష్టి సారిస్తూ ప్రతి ప్రాంతం లో ఉండే కుటుంబాలకు మేము ఉన్నాం అనే దైర్యం కల్పించడం అనే విధానం పై ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు సాగుతున్న డాడీ బంజారా లయన్స్ క్లబ్ ముందుకు సాగుతుంది అని రాష్ట్ర కమిటీ తెలిపింది అలాగే మహబూబాబాద్ జిల్లా కమిటీ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది,మహబూబాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులుగా హేమా నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి రుడావత్ శ్యామ్,జిల్లా కోశాధికారిగా బానావత్ స్వామి మరియు పూర్తిస్థాయిలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగినది ఈ సమావేశంలో ఏఐడిబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు స్వామి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ (కొండ),జాతీయ కార్యనిర్వహక సభ్యులు శ్రీ వెంకటి,రాష్ట్ర కమిటీ సభ్యులు జాడ్ పోడ్ ప్రసాద్, రుడావత్ జయరాం,రత్నావత్ వినోద్ కుమార్,ధోణవాన్ శ్రీనివాస్, దియావత్ రాము,తాజనోత్ వెంకట్ మరియు మహబూబాబాద్ జిల్లా దాడి బంజారా నాయకులు పాల్గొనడం జరిగింది.














