EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆలేరు శివాలయంలో కల్యాణోత్సవం

ఈతరం భారతం మార్చ్ 27

యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు శివాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా,కన్నుల పండుగగా శుక్రవారం జరిగింది.భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆలయం మారుమోగింది. కళ్యాణమూర్తులతో ఎదుర్కోలు ఉత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు అమ్మవారి మెడలో స్వామివారి మంగళసూత్రధారణ ఘనంగా జరిగింది. ఈ కల్యాణంలో చిట్టిమిల్ల కేవల్,రాణి దంపతులు,బోల్లం అంబదాసు,లీలా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా, పూజారి టంగుటూరు ఋషి ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చింతకింది రామానుజం, ఎలగందుల శీను, పులగం భాస్కర్, బొద్దుల శ్రీను,రమేష్, చిట్టిమిల్ల వెంకటేష్,బొమ్మ శివలింగం,మురారి,కటకం సిద్దిరాజు,పాశికంటి సంతోష్, మార్గం నరహరి,పిస్కె ఉపేందర్, పోతుగంటి సంపత్ కుమార్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం కల్యాణోత్సవ శోభాయాత్ర కూడా అంగరంగ వైభవంగా జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top