EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ మొదలు

ఈతరం భారతం సిద్దిపేట ఏప్రిల్ 5

సిద్ధిపేట జిల్లా రైతాంగానికి ఇది తీపి కబురు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రంగనాయక సాగర్ జలాశయంలోకి నీటి పంపింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎండిపోయే దశలో ఉన్న యాసంగి పంటలను కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుంది.యాసంగి సీజన్ ముగింపు దశలో సాగునీటి ఎద్దడిపై సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రంగనాయక సాగర్‌లో ప్రస్తుతం కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే ఉందని, యాసంగి పంటలు పూర్తిగా పక్వానికి రావాలంటే మరో 1 టీఎంసీ నీరు అవసరమని వివరిస్తూ ఇటీవలే సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.హరీష్ రావు విజ్ఞప్తికి స్పందించిన మంత్రి, వెంటనే రంగనాయక సాగర్‌లోకి నీటిని పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం, ఏప్రిల్ 5 న అధికారులు పంపింగ్ ప్రక్రియను ప్రారంభించారు.నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని వేలాది మంది రైతులకు పెద్ద ఊరట లభించింది. చేతికందే దశలో ఉన్న యాసంగి పంటలు నీరు లేక ఎండిపోతాయన్న ఆందోళనలో ఉన్న రైతులకు ఈ నిర్ణయం భరోసానిచ్చింది.రైతుల ఇబ్బందులను అర్థం చేసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీరు విడుదలయ్యేలా కృషి చేసిన హరీష్ రావుకు రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top