ఈతరం భారతం మేడ్చల్ ఏప్రిల్ 11:
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలలో ఎంపీ ఈటల రాజేందర్పాల్గొని ఆయా విగ్రహానికి పులా మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అంతరాలు, వివక్ష, దోపిడీ, దౌర్జన్యాలకు వెతిరేకంగా…పేద ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఉద్యమం చేసిన మహానీయుడు మహాత్మ జ్యోతిబాపూలే. ఈ దేశం గర్వించే ముద్దుబిడ్డ, ఈ దేశానికే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారికి గురువుగా, మార్గదర్శకంగా నిలిచిన మహానీయుడు మహాత్మ జ్యోతిబాపూలే.పూలే సతీమణి సావిత్రిబా పూలే మహిళలకు విద్య ఉండకూడదని నిషేదించిన నాడు…దేశంలో మహిళలకు చదువు ఉంటేనే సమాజం బాగుపడుతుంది అని నమ్మి… ఆనాటి ఉన్మాదానికి వ్యతిరేకంగా, సనాతన పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆడపిల్లలకు చదువు చెప్పిన మొట్టమొదటి గురువు సావిత్రిబాయి పూలే. ఆనాడు మహిళలకు చదువు నేర్పించారు కాబట్టే ఇవాళ కల్పన చావ్లా, ఇందిరా గాంధీ, IAS, IPS, ఇలా అన్ని రంగాలలో మగవాళ్లకు పోటీపడే శక్తీ, సత్తా వచ్చిందన్నారు.
నరేంద్ర మోడీ లోకల్ బాడీస్ లోనే రిజర్వేషన్ లు కాకుండా చట్టసభలలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ను చేసారు…అలాంటి చట్టం రావటానికి కారణం సావిత్రిబా పూలే . అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా ఈ దేశహితం కోసం జరిగే చట్ట నిర్మాణంలో కూడా మహిళలు ఉండాలని నరేంద్ర మోడీ సంకల్పం గొప్ప సంకల్పంగా భావిస్తున్నానన్నారు.
జవహర్ నగర్ లో రాజు , వారి పాలకమండలి పూలే గారి 199వ జయంతి సందర్భంగా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించుకొని..ఆ మహినీయుని యొక్క ఆశయాలు, స్ఫూర్తి రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. త్యాగాలకు మారుపేరు, సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పోరాడిన వాడు, దేశ శ్రేయస్సు కోసం సమాజం కోసం పాటుపడిన మహనీయుడు కాబట్టి అయన విగ్రహాన్ని చూసినప్పుడల్ల బాలాజీ నగర్ ప్రజానీకానికి అయన ఆశయాలు, పోరాటపటిమ, సమాజానికి చేసిన సేవ గుర్తుకు రావాలిని అందులో కొంతనైనా మనం అలమార్చుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు జోగారావు,వంశరాజ్ మల్లేష్, కమల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి, వేణుగోపాల్, మహిపాల్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.














