ఈతరం భారతం సిద్దిపేట మే 2
సిద్దిపేట పట్టణం 3 వార్డ్ రంగదాంపల్లి లో శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయం ప్రాంగణం లో నిర్మించిన అన్న ప్రసాద భవనం ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా మాట్లాడుతు.. సిద్దిపేట అన్నదానాలకు పెట్టింది పేరన్నారు…ఆధ్యాత్మికతకు…అన్నదానలకు నెలవు గా మారిందన్నారు.. హనుమాన్ దీక్ష…. బిక్ష కు బీజం వేసింది మన సిద్దిపేటనేన్నారు.. రావి చెట్టు హనుమాన్ దేవాలయం లో 41రోజులు, గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం లో 21రోజులు, పంచముఖ హనుమాన్ దేవాలయం లో 21 రోజులు బిక్ష కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.. రావి చెట్టు హనుమాన్ దేవాలయం, గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం, నేడు రంగాధంపల్లి లో ప్రారంభం చేసుకున్నం. సిద్దిపేట లో చేసిన అన్ని భవనాలకు నా సహకారం అందించానని చెప్పారు. హనుమాన్ దీక్ష సమయం లో వేలాది మంది స్వాములు దీక్ష లో పాల్గొంటారని వారికి బిక్ష ఎంతో ఈ అన్నదాన భవనం లు ఉపయోగ పడుతున్నాయన్నారు.. ఎన్నో కార్యక్రమాలకు సిద్దిపేట నెలవు గా మారిందన్నారు. మట్టి వినాయకుల పంపిణి మొట్టమొదలు మనసిద్దిపేట లోనే ప్రారంభం చేసుకున్నామన్నారు. రంగదాంపల్లి గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ఆదర్శం గా నిలుపుకున్నామని చెప్పారు. అన్నదాన భవనం కు సహకరించిన దాతలను ఈ సందర్బంగా సత్కరించారు.














