EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

క్రీడా సంఘాలకు సహకరిస్తాం  మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి

ఈతరం భారతం  హైద్రాబాద్ మే 5 :

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కొరకు  క్రీడా సంఘాలు నిర్వహించే అన్ని కార్యక్రమాల విజయవంతనికి సంపూర్ణంగా సహకరిస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, చైర్మన్ శివసేనారెడ్డిలు తెలిపారు.ఈరోజు ఎల్ బి స్టేడియంలో 09 & 10 మే 2026 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్అధికారిక బ్రోచర్‌ను క్రీడా శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు మరియు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శ్రీ కె. శివసేన రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ చాంపియన్‌షిప్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలోతెలంగాణ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం. మహిపాల్ గారు, ఆర్‌ఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం. నర్సింగ్ రావు , హైదరాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం. ప్రవీణ్ కుమార్ మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎన్. సంతోష్ పాల్గొని, తెలంగాణలో కిక్‌బాక్సింగ్ అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహం మరియు సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top