ఈతరం భారతం న్యూఢిల్లీ: సెప్టెంబర్ 6 ఆదివారం
______________________________________
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనికేతన్ ప్రాంతంలో శివ మందిరం సమీపంలోని ఓ పాత బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనంలో పీజీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో పాటు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ, డీడీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.















