EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఛత్రపతి సాహు మహారాజ్ స్ఫూర్తి తో బీసీలు పాలన వైపు అడుగులు వేయాలి

ఈతరం భారతం వార్తాంశం

ఛత్రపతి సాహు మహరాజ్ మరాఠాల భోంస్లే రాజవంశానికి చెందిన ఒక యాదవ్ రాజు. ఆయనని ఛత్రపతి రాజర్షి సాహూ, రాజర్షి సాహూ మహారాజ్, కొల్హాపూర్ సాహూ అని కూడా పిలుస్తారు. ఆయన భారత రాచరిక రాష్ట్రమైన కొల్హాపూర్ మొదటి మహారాజుసాహు మహారాజ్ పట్టాభిషేకం 1894 ఏప్రిల్ 2న జరిగింది.ఆ రోజు ఆయన కొల్హాపూర్ సంస్థానానికి రాజుగా అధికారికంగా పట్టాభిషేకంపొందారు.06-05-1922వరకు దాదాపు 28 సంవత్సరాలు కొల్హాపూర్ సంస్థానాన్ని సామాజిక న్యాయమే లక్ష్యంగా పరిపాలించారు.

.సామజికఅసమానతలనుచూస్తూపెరిగినఛత్రపతిసాహు మహారాజ్ సమానత్వాన్ని నెలకొల్పాలని సంక ల్పించి .సామజిక న్యాయం, సమానత్వం, విద్యా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. వెనక బడిన వర్గాల అభ్యున్నతి కోసం స్త్రీ విద్య కోసం అంటరాని తనం, అమానుషం, పీడన, దోపిడీ, వివక్ష నిర్ములన కోసం ఆయన పాలన లో తీసుకున్న సంస్కరణలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయి.26-07- 1902 లో కొల్హాపూర్ సంస్థానం లో బ్రాహ్మణేతరులైన, బీసీ,ఎస్సి ఇతర వెనక బడిన వర్గాల

ప్రజలకు విద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లను కల్పిస్తు ఉత్తర్వులను జారీచేయడం తోపాటు గ్రామపరిపాలనరంగంలోవంశపార్యాపరంగాకొనసాగుతున్న,పటేల్, పట్వారి, కులకర్ణి వ్యవస్థను రద్దు చేస్తూ సామజికన్యాయంఅమలు, కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న గొప్ప సంఘ సంస్కర్త ఛత్రపతి సాహు మహారాజ్ , పూలె ను ఆదర్శంగా తీసుకొని స్త్రీలు, బాలికల విద్య కోసం పాఠశాల లను ఏర్పాటు చేసి పూర్తి ఉచితవిద్యనందించడం తోపాటు బాలికలకు హాస్టళ్లను ఏర్పాటుచేశారు.బాల్య వివాహల నిర్ములన కోసం కృషి చేయడం తోపాటు కులాంతర వివాహలను చట్టబద్దం చేశారు. తన పాలన లో వ్యవసాయమే జీవనాదారంగా బతుకుతున్న రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల పై ఆధారపడి నష్ట పోకుండా సహకార సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు, చేయూతనిచ్చారు.1919మే నెల మూడు తారీకు న వెట్టి చాకిరీ వ్యవస్థ ను రద్దు చేస్తూ చట్టం చేసి బానిసత్వ నిర్ములనకు శ్రీకారం చుట్టారు. అస్పృశ్యుల హక్కుల సాధన కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించినమూక్ నాయక్. పత్రికను నడపడానికి సాహు మహారాజ్ రాజు ఆర్థిక సాయం అందించడం తోపాటు అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక సాయం అందించి ఆదుకున్న త్యాగశీలి చత్రపతి సాహు మహారాజు గారు 06-05-1922 నాడు భౌతికంగా ఆయన దూరమైనా ఆయన దేశ ప్రజల మనసుల్లో చిరంజీవి గానిలిచిపోయారు, స్వతంత్రానికి పూర్వమే అణగారిన కులాల ప్రజలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్ర సృష్టించారు చత్రపతి సాహు మహారాజ్ హక్కులకు దూరమైన ప్రజల నుండి వచ్చిన నాయకులు మాత్రమే వారి హక్కుల కోసం పనిచేస్తాను, దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటినా  రాజ్యాంగ పలాలు బీసీలకు సంపూర్ణంగా అందకపోవడంసామాజిక న్యాయస్పూర్తికి విరుద్ధం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు,రాజకీయరంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని గత 70 సంవత్సరాలుగా బీసీలు పోరాడుతున్నా ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ ప్రజల అరిగోస ను పట్టించుకునే నాధుడే లేడు. చత్రపతి సాహు మహారాజు స్ఫూర్తితో బీసీలు మిలిటెంట్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి. ఓటరుగా మిగిలిపోకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలను చదరగొట్టి, మెజార్టీ ఓటరులు పాలనవైపు అడుగులు వేసినప్పుడే చత్రపతి సాహు మహారాజు ఆశించిన, నిజమైన సమ సమాజ నిర్మాణం పూర్తవుతుంది.

వ్యాస కర్త బూర్గుపల్లి కృష్ణ యాదవ్ MA

బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు

సెల్ : 9866170384

Related News

Select the Topic
Scroll to Top