EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

15 నుండి బాలసంస్కార్-2026 ప్రారంభం

ఈతరం భారతం  హన్మకొండ మే 14 :

శ్రీరామకృష్ణ సేవా మందిరం, కె ఎల్ ఎన్ రెడ్డి కాలనీ, హనుమకొండ యందు “బాలసంస్కార్-2026 వేసవి శిక్షణా శిబిరం” ఈ నెల 15 నుండి పది రోజులు ప్రతి రోజు ఉదయం 6 నుండి 11 గంటలవరకు నిర్వహిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షులుకటంగూరి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం నుండి జరుగనున్న “బాల సంస్కార్ 2026” కార్యక్రమంలో ఈ 10 రోజులపాటు ఉదయం గం. 5:40 ల నుండి గం 11:30ల వరకు తమ సమయాన్ని కెటాయించి, స్వచ్ఛంద వాలంటీర్ గా తమ సేవలు అందించాలన్న తపన, అభిలాష కలవారి కొరకు నిన్న (తేది:14.05.2026 శనివారం) సాయంత్రం 5 గంటలకు “వాలంటీర్ల శిక్షణ సమావేశము” మన సేవా మందిరంలో ఏర్పాటు చేయనైనది. అందులో వాలంటీర్లకు వారి బాధ్యతల పంపిణీ మరియు పాటించాల్సిన నియమనిబంధనల గురించి చర్చించి సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించు కోవడం జరిగింది. శిక్షణ సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లు వేసవి శిబిరంలో పాల్గొనే అర్హత పొందడంతో పాటుగా తమ అమూల్య సేవలతో మూర్తిత్రయ ఆశీస్సులు పొంది 10 రోజుల బాలసంస్కార్-2026 వేసవి శిబిరాన్ని విజయవంతం చేయాలని కటంగూరి సత్యనారాయణ రెడ్డి కోరారు.

Related News

Select the Topic
Scroll to Top