ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 5 శనివారం
________________________________________
లద్దాఖ్‌లో సింధు నదిపై తొలి రాక్ చెక్‌డ్యామ్- సిమెంట్ లేకుండానే సహజ రాళ్లతో నిర్మాణం- దాదాపు 10 అడుగులు పెరిగిన నదీ నీటిమట్టం- లేహ్, కార్గిల్‌లో మరో 36 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు.
లడఖ్ లోవ్యవసాయానికి నీటి కొరతను తగ్గించే దిశగా కీలక ముందడుగు పడింది. సింధు నదిపై ఉప్సీ ప్రాంతంలో భారత్ రాక్ చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో సింధు నదిపై ఈ తరహా నిర్మాణం చేపట్టడం ఇదే తొలిసారి. సిమెంట్‌ను ఉపయోగించకుండా సహజంగా లభించే భారీ రాళ్లు, బండరాళ్లను అమర్చి నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ వల్ల నదిలో నీటిమట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీంతో సమీపంలోని వ్యవసాయ భూములకు నీటిని మళ్లించడం సులభమైంది.లద్ధాఖ్లో వ్యవసాయం ప్రకృతితో నిరంతం పోరాటం లాంటిది. చలి, పొడి వాతావరణం, పరిమిత సాగుభూమి వీటిన్నింటికీ తోడు నీటి లభ్యత మరో సవాలు. ముఖ్యంగా వసంకాలంలో విత్తనాలు వేసే సమయంలో రైతులకు సాగునీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ సమయంలో సింధు నదిలో నీటి ప్రహవాం, నదీగర్భం స్థాయి కారణంగా పొలాలకు నీటని పంపింగ్ చేయడం అనేక ప్రాంతాల్లో కష్టంగా మారుతోంది. ముఖ్యంగా నది లోతైన, ఇరుకైన లోయల గుండా ప్రవహించే ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. నదిలో నీరు ఉన్నప్పటపికీ దాన్ని వ్యవసాయ భూములకు మళ్లించేందుకు అవసరమైన స్థాయిలో నీటిమట్టం లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. ఉప్సీ వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ ఈ సమస్యను కొంతవరకు అధిగమించేలా రూపొందించారు.















