EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బంగారం ధర పెరిగితే ఎవరికి నష్టం…?

ఈతరం భారతం  ప్రత్యేక ప్రతినిధి

వార్తాంశం

ప్రసార సాధనాల్లో ఈమధ్య బంగారం ధర పెరగడం గురించి రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. కానీ బంగారం ధర పెరిగితే దానివల్ల ఎవరు నష్టపోతారు అన్నది గమనించడం లేదు. బంగారు ఆభరణాల తయారీపై కొన్ని కోట్లాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిందే. బంగారం ధర తక్కువ ఉన్నప్పుడే వారి దగ్గరికి కష్టమర్లు నగలు చేయించుకోవడానికి వస్తారు. స్వర్ణకారులకు చేతి నిండా పని లభిస్తుంది.

కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ? ఎంతసేపు బంగారం ధర పెరిగితే సామాన్యుడికి అందుబాటులోకి రాకుండా పోతుంది అని మీడియా చెబుతోంది. మరి ధనవంతులు బంగారం ధర పెరిగినప్పుడు కూడా ఆభరణాలు చేయించుకుంటున్నారా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు ఇప్పుడు బంగారానికి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. వీరు బంగారం కొనుగోలును ఆపివేస్తే వ్యాపారులు లాభ పడతారా? స్టాక్ మార్కెట్లో బంగారం ధర పెరిగినప్పుడు ,తగ్గినప్పుడు షేర్ విలువలో మార్పులు రావడం సహజం. అంతమాత్రాన భయపడవల సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచిస్తే మన దేశంలో కావలసినంత బంగారం ఉంది. అది కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంది. అది జన సామాన్యంలోకి వస్తే బంగారం ధర సాధారణ స్థితికి వస్తుంది. అది ఎలా బయటికి తీయాలి అన్నది ఆలోచించాల్సిన విషయం. బంగారం వృత్తి  పై ఆధారపడి ఉన్న స్వర్ణకారులకు చేతినిండా పని కావాలంటే వారి దగ్గరికి వచ్చే వినియోగదారులు పెరగాలి. వినియోదారులు పెరగాలంటే బంగారం ధర తగ్గాల్సిందే. అప్పుడే మన దేశ మహిళలు స్వర్ణాభరణాలతో మెరిసిపోతారు.

Related News

Select the Topic
Scroll to Top