ఈతరం భారతం మేడ్చల్ మే 20
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గుడిసె వాసన సంఘం అధ్యక్షులు బి.రవి ఆధ్వర్యంలో నేడు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.కలెక్టర్ పోడియం కు దూసుకుపోయిన నాయకులు,, పోలీసులకు ఆందోళన కార్లకు ఉదృత్వ వాతావరణం నెలకొంది. తదనంతరం రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో కలెక్టరుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా కలక్టర్ స్పందిస్తూ అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో సంఘం ఉపాధ్యక్షులు మొలుగు నవీన్,ప్రధాన కార్యదర్శి బాలుగుల రమేష్ కుమార్,జాయింట్ సెక్రెటరీ బాకీ సోమయ్య,ఆర్గనిగింగ్ సెక్రెటరీ లు గ్యారే ఉపేందర్,జి.నాగరాజు,కోశాధికారి సోమారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.














