ఈతరం భారతం రంగారెడ్డి జిల్లా జూన్ 1:
రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు బాలికలు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది షాద్నగర్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రీతి (22), చున్మాన్ కుమారి (15) నందిగామ గ్రామంలోని అయ్యప్ప ఆలయ పరిసరాల్లో నివసిస్తున్నారు కట్టెల కోసం వెళ్లిన వీరు రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఆంధ్రి ఎక్స్ప్రెస్ డౌన్ లైన్లో, అదేవిధంగా అప్ లైన్లో వస్తున్న గూడ్స్ రైలు ఒకేసారి సమీపించడంతో ప్రమాదానికి గురయ్యారు లోకో పైలట్ కె. శ్రీనివాస్ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న షాద్నగర్ రైల్వే పోలీసులు, 108 అంబులెన్స్ సహాయంతో ఇద్దరినీ షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు లోకో పైలట్ కె. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు షాద్నగర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.














