ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 4 ;
హైదరాబాద్ నగరంలో అమీర్‌పేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్ నంబర్ 1043 వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణాలకూ సైతం మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన పోలీసులు ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించారు. పోలీస్, ఫైర్, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.














