ఈతరం భారతం రంగ రెడ్డి జూన్ 5 :
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని బచ్‌పాన్ స్కూల్ గ్రౌండ్‌లో టైగర్స్ కుంగ్-ఫు & కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది. అకాడమీ రంగారెడ్డి జిల్లా ఆర్గనైజర్ మునుకుంట్ల శివ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హయత్‌నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి , స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ , హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. బెల్ట్ గ్రేడింగ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా బెల్టులు మరియు ప్రశంసా పత్రాలు అందజేయగా, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా ఎంతో అవసరమని తెలిపారు. కుంగ్-ఫు సాధన ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెంపొందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు, బాలురకు ఆత్మరక్షణ నైపుణ్యాలు అవసరమని, మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా మాస్టర్ మునుకుంట్ల శివ గౌడ్, బ్లాక్ బిల్డర్స్ క్రాంతి, కార్తికేయ జేతిను తదితరులు పాల్గొన్నారు.














