EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 6

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న భాగ్యనగరాన్ని వరుణుడు కరుణించాడు. నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. ఫలితంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌, బోరబండ, యూసఫ్‌గూడ, ఎస్ఆర్నగర్‌, సనత్‌నగర్‌, రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌ నగర్‌ ప్రాంతాల్లో వర్షం కురుసింది. హైదర్‌గూడ, ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వాన జల్లులతో నగరవాసులకు ఉపశమనం లభించినట్టైంది. ఇంకోవైపు రంగారెడ్డి జిల్లా కోహెడ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Related News

Select the Topic
Scroll to Top