EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కన్నవారికే కాలయముడు…

ఈ తరంభారతం : సోషల్ మీడియా

మొబైల్‌లో గేమ్స్ ఆడొద్దని ఫోన్ లాక్కున్నందుకు…16 ఏళ్ల బాలుడు కన్నవారి పైనే కాలయముడిగా మారిన అత్యంత ఘోరమైన సంఘటన కర్ణాటకలోని కొప్పళ జిల్లా అయోధ్య క్యాంపులో జరిగింది.ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన వెంకట మణిదీప్‌ (16)ను రాత్రి పూట గేమ్స్ ఆడుతుంటే అక్క ప్రగతి (18) మందలించింది. తల్లిదండ్రులు వెంకటనాయుడు (45), సౌజన్య జోక్యం చేసుకుని ఫోన్ లాక్కున్నారు…దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు, ఇంట్లోని మచ్చుకత్తితో అక్కపై, అడ్డువచ్చిన తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పక్క గదిలోని తాతయ్య, నానమ్మ బయటకు రాకుండా గది తలుపులకు గడియ పెట్టాడు…అనంతరం అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. ఈ దాడిలో అక్క ప్రగతి, తండ్రి వెంకటనాయుడు ప్రాణాలు కోల్పోగా.. తల్లి, నిందితుడైన బాలుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top