ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 10
పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లా పఖి కలాన్ గ్రామానికి చెందిన రైతులంతా ఒక్క చోటకు చేరి ఒక వినూత్న విజ్ఞప్తిని తెరపైకి తెచ్చారు. “ప్రస్తుతం వరి సాగు సీజను మొదలైంది. ఈ సమయంలో మాకు నీటి మోటార్లు ఎంతో ముఖ్యం. దయచేసి మా నీటి మోటార్ల జోలికి రాకండి. మీరు వెంటనే ఏదైనా ఒక బ్యాంకులో ఖాతా తెరిచి, ఆ వివరాలను మాకు పంపించండి. మేము ప్రతి నెలా మా పంటల రక్షణ నిధిగా అందులో నేరుగా డబ్బులు జమ చేస్తాం” అంటూ అన్నదాతలు ఆ వీడియోలో దొంగలను వేడుకోవడం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. దొంగలకు నేరుగా లంచం ఆఫర్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ నిరసన వెనుక అన్నదాతల ఆవేదన, రక్షణ కరువైన వైనం స్పష్టంగా కనిపిస్తుండగా.. చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.















