ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 10:
మృగశిర కార్తీ పురస్కరించుకొని నాంపల్లి నుమాయిష్ మైదానంలో భేటీని సోదరులు ప్రతి ఈటా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కి వచ్చే ప్రజలకోసం జన సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సంస్థ కోశాధికారి సుశీల్ శ్రీవాస్తవ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఈ నెల 8..9..తేదీల్లో తమ సంఘం మెడికల్ కమిటీ కన్వీనర్ సీతారామ్ ఠాకూర్ నేతృత్వంలో ఒక భారీ సేవా శిబిరాన్ని నిర్వహించామన్నారు.
మైదానంలో ‘చేప ప్రసాదం’ (చేప మందు) పంపిణీ సందర్భంగా దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు, అతిథుల సహాయార్థం, సేవ కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ రెండు రోజుల సేవా శిబిరాన్ని జూన్ 8వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీ (జైళ్లు) శ్రీ మహమ్మద్ అహసాన్ రెజా (IPS) ప్రారంభించగా, ఇది జూన్ 9వ తేదీ మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా కొనసాగింది. శిబిరం నిర్వహించిన సమయంలో జన సేవా సంఘ్ సభ్యులు వచ్చిన సందర్శకులకు పెద్ద ఎత్తున పౌష్టిక ఆహార పండ్లు, కిచిడీ మరియు స్వచ్ఛమైన తాగునీటిని పంపిణీ చేశారు. దీనితో పాటు, చేప మందుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాంప్లెట్ల (కరపత్రాల) ద్వారా ప్రజలకు చేరవేశారు. ఈ భారీ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం జరిగినందులకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇందుకు జన సేవా సంఘ్‌కు చెందిన వందలాది మంది కార్యకర్తలు గత వారం రోజులుగా రాత్రింబగళ్లు శ్రమించారు. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ శిబిరం ద్వారా లబ్ధి పొందారని తెలిపారు.
ఈ పునీత సేవలో జన సేవా సంఘ్ ప్రముఖ పదాధికారులు, సభ్యులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. వారిలో ముఖ్యులు:
సీతారామ్ ఠాకూర్( (కన్వీనర్, మెడికల్ కమిటీ)
సుశీల్ శ్రీవాస్తవ (కోశాధికారి, కేంద్ర కమిటీ)
ఆర్. పి. సింగ్ (కన్వీనర్, ఛత్ పూజ మరియు ఉత్సవ కమిటీ)
శ్రీకాంత్ పాండే (కన్వీనర్, శిష్టాచార్ కమిటీ)
డి. డి. తివారీ (కన్వీనర్, నిర్వహణ మరియు సమన్వయ కమిటీ)
కే. డి. చౌబే (కన్వీనర్, డెలిగేషన్ కమిటీ)
రాధే శ్యామ్ రాయ్ యాదవ్ (ఉత్తర విభాగం అధ్యక్షుడు, కేంద్ర కమిటీ సభ్యుడు)
వీరితో పాటు ఎల్. ఎన్. చౌబే, భోలా సింగ్, శ్రవణ్ కుమార్, ఏ. కే. మిశ్రా, సురేష్ పండిట్, శ్రీ ఎల్. ఎమ్. చౌదరి, శ్యామ్ షా, మహమ్మద్ మునవ్వర్, మీడియా ఇంచార్జ్ బినీత్ సింగ్, మదన్ లాల్ రావల్, కుపారామ్ చౌదరి, రాజేష్ శర్మ, శ్రీ హరి సింగ్ మరియు జే. కే. సింగ్ సహా సంఘం యొక్క పలువురు సీనియర్ సభ్యులు హాజరై ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















