EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కూరాకుల గోపీకి టీడబ్ల్యూజేఎఫ్ నివాళి

ఈతరం భారతం ఖమ్మం/రఘునాథపాలెం, జూన్ 10 :

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్ – 2843) ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు కూరాకుల గోపీకి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ నివాళులు అర్పించింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో బుధవారం నిర్వహించిన గోపీ దశ దినకర్మకు హాజరైన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, టీబీజేఏ జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, స్టేట్ కౌన్సెల్ మెంబర్ నలుబోల మధుశ్రీ, జిల్లా నాయకులు టిఎస్ చక్రవర్తి, కొరకొప్పుల రాంబాబు, కొమిరె నాగేశ్వరరావు, భూక్యా శ్రీనివాస్ తదితరులు చిత్రపటం వద్ద పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గోపీ మరణం జర్నలిస్టు వృత్తికి తీరని లోటని ఆవేదన వెలిబుచ్చారు. గోపీ భార్య క్రాంతి తో పాటు కుమార్తెలు తేజస్విని, యశస్వినిలను ఓదార్చారు. సీనియర్ జర్నలిస్టుగా గోపీ మరణం అనంతరం ఆయన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా లభించాల్సిన అన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు పూర్తి స్థాయిలో అందేలా జిల్లా కమిటీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top