ఈతరంభారతం యాదాద్రి భువనగిరి జూన్ 18
యాదాద్రి పాటిమట్ల గ్రామానికి చెందిన మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ వ్యవస్థాపకులు కురుమేటి నవీన్ తన వారి అమ్మగారి జ్ఞాపకార్థంగారాష్ట్రవ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి నల్గొండ జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రజిత చేస్తున్న సేవలకు బెస్ట్ సర్వీస్ అవార్డ్స్ ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరు సాటి మనిషికి సహాయం చేయాలని మానవసేవే మాధవ సేవ అనినిస్వార్ధ సేవ చేస్తున్న వారిని తమ సంస్థ గుర్తిస్తుందని, మాతృదేవోభవ పితృదేవోభవ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆహ్వానిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు కురుమేటి నవీన్ తెలియజేశారు. అవార్డు ప్రకటించిన కురుమేటి నవీన్ కి అలాగే పరోక్షంగా తనకు సహకరించిన వారికి మిత్రులకు, ధన్యవాదాలు తెలియజేశారు రజిత.















