ఈతరం భారతం న్యూ డిల్లి జూన్ 19 ;
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ రీ ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జూన్ 21న జరగబోయే రీ ఎగ్జామ్ యథాతథంగా కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్ష నిలిపివేయాలంటూ కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరఫు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసం దాన్ని తోసిపుచ్చింది. నీట్‌కు సంబంధించిన అన్నీ పిటిషన్లు జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ముందుకు వెళ్లాయని వీటిని కూడా ఆ ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు వేసిన పిటిషన్లలో అత్యవసర పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. పేపర్ లీకేజీ, అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సమస్యలు ఉన్నాయన్న పిటిషన్లను ఈ మేరకు సుప్రీంకోర్టు















