EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శబ్ద కాలుష్యం సృష్టించే బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ కింద వేసి ధ్వంసం: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

ఈతరం భారతం 19.06.2026 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఖమ్మం:

నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి విపరీతమైన శబ్ద కాలుష్యం సృష్టించే బుల్లెట్ సైలెన్సర్లను పోలీస్ హెడ్ క్వాటర్స్ లో రోడ్డుపై పరిచి రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగిందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. బైక్‌ల విషయంలో స్టైల్ కోసం కొంత మంది యువకులు,ఆకతాయిలు తమ బైకులకు శబ్దం ఎక్కువగా వచ్చే సైలెన్సర్లను అమర్చుకుంటూ… ఆ సైలెన్సర్ల అర్థాన్నే మార్చేస్తున్నారని అన్నారు. ఇంకొంత మందైతే.. ఆ సైటెన్సర్లకు రంధ్రాలు చేసి మరీ సౌండ్ వచ్చేలా చేస్తున్నారని, అది ఢాం.. ఢాం.. అంటూ పెద్దగా సౌండ్ చేసుకుంటూ పోతే వారికి అదో రకమైన పైశాచిక ఆనందం మన్నారు.

సైలెంట్‌గా పోయేవాళ్లు.. ఆ సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దాలు విని భయపడుతున్నారని అన్నారు. వయసు పైబడిన వారు, గుండె జబ్బులు ఉన్నవారికైతే గుండె ఆగినంత పనౌతుందని అనేక ఫిర్యాదు వచ్చాయని, ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో నగరంలో సైలెన్సర్లపై కొరడా ఝుళిపించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లకు పెద్దగా శబ్దం వచ్చేలా అమర్చిన సైలెన్సర్లను గుర్తించామన్నారు. అధికంగా శబ్దం చేస్తున్న 1650 బైకులను గుర్తించి వాటి సైలెన్సర్లను తీయించి, రోడ్డుపై ఇలా పేర్పించి.. రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించామన్నారు. యువత ఎక్కువగా తమ బుల్లెట్ వాహనాలకు అధిక మోతాదులో శబ్దం వచ్చే సైలెన్సర్లను వాడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇకపై వాహనాలకు అధిక శబ్దం చేసే హారన్లపైనా దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top