ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 19
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు ఆన్లైన్లో అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారీయా తెలిపారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో కనీసం పదేళ్ల రెగ్యులర్ సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను జులై 13 లోపు ఆన్ లైన్ వెబ్ పోర్టల్ https://nationalaward-stoteachers.education.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు.















